బీపీఈడీ సీట్లు కేటాయింపు
24-08-2024 12:25 AM
హైదరాబాద్, ఆగస్టు 23(విజయక్రాంతి): బీపీఈడీ, యూజీడీపీఈడీ మొదటి విడుత సీట్లను కేటాయించారు. ఈమేరకు టీజీ పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పీ రమేశ్‌బాబు శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,737 సీట్లకు 753 సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. బీపీఈడీ, డీపీఈడీలకు కలిపి మొత్తం 967 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. బీపీఈడీ సీట్లు 1,437, డీపీఈడీ సీట్లు 300 ఉన్నాయి. మొత్తం 1,737 సీట్లలో బీపీఈడీ సీట్లు 600 భర్తీ కాగా, డీపీఈడీ 153 సీట్లు భర్తీ అయినట్టు ఆయన పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 28లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.






