ఏసీబీ వలలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్
35 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కారు. లంచం తీసుకుంటూ శుక్రవారం హైదరాబాద్ నారాయణగూడ సర్కిల్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ బీ వసంత ఇందిర రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక వ్యక్తి ఖాతాల్లోని వ్యత్యాసాలను పట్టించుకో కుండా ఉండేందుకు ఆమె రూ.35 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో ట్రాప్ చేసిన అధికారులు కార్యాలయంలో ఆమె లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టు కున్నారు.
అనంతరం నిందితురాలిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వాధికారులు ఎవరైనా లంచం ఇవ్వాలని అడిగితే తమకు సమాచారం అందించాలని కోరారు. లంచ గొండి అధికారులపై ఏసీబీకి ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని, వెబ్‌సైట్ acb@telangana.gov.in మెయిల్ చేయాలని సూచించారు.






