పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) పథకం కింద పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో వివిధ కోర్సుల్లో స్వల్పకాలిక శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతున్నాం.
అందుబాటులో ఉన్న కోర్సులు:
సీ.ఎన్.సీ ఆపరేటర్ (CNC - VMC), ఎలక్ట్రికల్ వెహికల్ సర్వీస్ లీడ్ టెక్నీషియన్ (EV), 3D ప్రింటింగ్ ఆపరేటర్, మార్చి 4తేదిన దరఖాస్తుకు చివరి తేదీ అని, తరగతులు మార్చి 05 నుండి ప్రారంభం అవుతాయని, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ తో పాటు 2 ఫోటోలు జాత చేయాలని, శిక్షణ కాలంలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని, ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాతో పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ కార్యాలయంలో సంప్రదించి, ఈ ఫోన్ నంబర్ల కు 6303662956, 8500467552 ఫోన్ చేయాలని కోరారు.




