30 May, 2026 | 10:22 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

30-05-2026 10:19 PM

నంగునూరు యూనియన్ బ్యాంక్ బిసి పోస్టుల భర్తీ

నంగునూరు,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో ఖాతాదారుల సేవా కేంద్రాన్ని నిర్వహించేందుకు బిజినెస్ కరస్పాండెంట్ పోస్టుకు దరఖాస్తులు కోరుతున్నట్లు గ్రామ్ తరంగ్ ఇన్ క్లూసివ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రతినిధి కోడాడి రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి 18 నుంచి 57 ఏళ్ల లోపు వయసున్న స్థానిక అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు.

అర్హత గలవారు తమ బయోడేటాతో పాటు ఆధార్, పాన్ కార్డ్, విద్యార్హత సర్టిఫికెట్లు, పోలీస్ వెరిఫికేషన్ పత్రం, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను జతచేసి, మే 30 నుంచి జూన్ 7వ తేదీ లోపు నంగునూరు యూనియన్ బ్యాంక్ శాఖలో అందజేయాలని సూచించారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు జూన్ 10న ఉదయం 10 గంటల నుంచి సిద్దిపేటలోని యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో రెండు విడతలుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.