30 May, 2026 | 10:21 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు

30-05-2026 10:21 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని లేండిగూడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోనాల మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు పైన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు సోనాల ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా ఆసుపత్రి మూసి ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే జరిగిన విషయాన్ని బోత్ ఎస్ఐకి తెలిపిన కొందరు అదే బస్సులో బోత్ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఉన్న పోలీస్ అధికారులు సిబ్బంది కలిసి క్షతగాత్రుని బోత్ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించినట్లు తెలిసింది.