రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
29-05-2026 12:21 AM
కడ్తాల్, మే28,(విజయక్రాంతి): రేషన్ షాపుల నిర్వాణ కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కడ్తాల్ తహసిల్దార్ జయశ్రీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని మైసిగండి, వంపుగూడ, ముద్విన్ గ్రామాలకు రేషన్ డీలర్ల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. పదో తరగతి పాసై ఉండాలని చెప్పారు. మైసిగండి (ఎస్టీ) రిజర్వేషన్, వంపుగూడ(ఓసీ) రిజర్వేషన్, ముద్విన్ ( బీసీ) రిజర్వేషన్లు కేటాయించినట్లు తెలిపారు. జూన్ 11 తేదీ కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలు నుండి 40 సంవత్సరాల వరకు అర్హులని చెప్పారు.






