29 May, 2026 | 1:17 AM

ఘనంగా బక్రీద్ వేడుకలు

29-05-2026 12:20 AM
  1. ఈద్గాలు, మసీదుల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు, దువా
  2. ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ చెప్పుకున్న మైనార్టీలు 
  3. హాజరైన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు

ఆమనగల్లు, మే 28, (విజయక్రాంతి): దైవచింతన, నిరుపమాన త్యాగానికి నిలువెత్తు ప్రతీకయిన బక్రీద్ (ఈద్-ఉల్-అజా) పండుగను జిల్లా వ్యాప్తంగా మైనార్టీ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. పండుగను పరిష్కరించుకొని జిల్లాలోని ఆయా నియోజకవర్గాల మైనార్టీ సోదరులు ఈద్గాల ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండల కేం ద్రాలతో పాటు ఆయా గ్రామాలలో ముస్లిం లు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉ త్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నా రు. మహమ్మద్ ప్రవక్త చూపిన త్యాగం, స హనం, జాలి, దయ, సేవ గుణాలను స్మరించుకుంటూ ఉదయం నుంచే ముస్లింలు నూతన వస్త్రాలు ధరించి, సుగంధ ద్రవ్యాలు చల్లుకుంటూ ఆయా ప్రాంతాల్లోని ఈద్గాలు, మసీదులకు భారీగా తరలివచ్చారు.

ఆమనగల్లులో భక్తిశ్రద్ధలతో సామూహిక నమాజ్

ఆమనగల్లు పట్టణంలోని ప్రధాన ఈద్గా వద్ద మౌలానా వాహేద్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు సామూహిక ప్రత్యేక నమాజ్, సలాం నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రత్యేక దువా కార్యక్రమంలో మౌ లానా మాట్లాడుతూ... లోకకళ్యాణం కోసం, ప్రపంచంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, దేశంలో వర్షాలు సమృద్ధి గా కురిసి పాడిపంటలు వృద్ధి చెందాలని అల్లాను వేడుకున్నారు. నమాజ్ అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ’ఈద్ ముబారక్’ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో పండుగ శోభ ఉట్టిపడింది. అనంతరం ఇళ్ల వద్ద సాంప్రదాయబద్ధంగా అల్లాహ్ పేరిట ’కుర్బానీ’ (త్యా గం) ఇచ్చి, ఆ మాంసాన్ని బంధువులకు, పే దలకు దానం చేస్తూ సోదరభావాన్ని చాటుకున్నారు.ఈద్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లుప్రస్తుత వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జామి యా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా మై దానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు క లగకుండా చల్లని పందిళ్లు వేసి, మంచినీటి సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా మె డికల్ షాప్ అసోసియేషన్ నాయకులు, బీఆర్‌ఎస్ కౌన్సిలర్ పాపిశెట్టి రాము ఈద్గా వ ద్దకు విచ్చేసి ముస్లిం సోదరులను కలిసి బ క్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో మస్జిద్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ మాసూం, గౌస్ మైనుద్దీన్, సభ్యులు జబ్బా ర్, నయ్యూం, జాంగీర్, జాక్, మాజీద్ ఖురే షి, అక్రం, బాబా, వహీద్, అబ్బాస్, ఆరీఫ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కడ్తాల్ మండలంలో...

కడ్తాల్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో బక్రీద్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇక్కడి ఈద్గా మైదానంలో మౌలానా జహీరుద్దీన్ ఆధ్వర్యంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి, దేశ అమనచైన్యం కోసం దువా చేశారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు గంపా వెంకటేష్, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, టిపిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. గంగా-జమునా తెహజీబ్ సంస్కృతికి ఈ పండుగ అద్దం పడుతుందన్నారు. కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు రవుఫ్, జావీద్, లాయక్ అలీ, జాంగీర్ అలీ, జాంగీర్ బాబా, వహాబ్, గౌస్, మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

తలకొండపల్లిలో...

తలకొండపల్లి మండల కేంద్రంతో పాటు వెల్జాల్ గ్రామాల్లో గురువారం బక్రీద్ పండుగను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. స్థానిక ఈద్గా వద్ద ఇమామ్ ఇంతియాజ్ మౌలానా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు, దువా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ సమాజంలో శాంతి, సామరస్యాలు వర్ధిల్లాలని కోరారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు రహమాన్, దస్తగిరి, బాబర్, రజాక్ అలీ, అహ్మద్, గులాం హుస్సేన్, రఫీ, ఇమ్రాన్, జాఫర్ తదితరులు పాల్గొని పండుగను ఘనంగా ముగించారు.

ఘట్‌కేసర్‌లో.. 

ఘట్‌కేసర్, మే 28 (విజయక్రాంతి) : బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఘట్కేసర్ సర్కిల్ ప్రాంతంలో స్థానిక ఈద్గాలు, మసీదులు ముస్లిం సోదరులతో కిక్కిరిసిపోయాయి. ఉదయాన్నే సాంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నలు, పెద్దలు పెద్ద సంఖ్యలో ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ (ప్రార్థనలు) నిర్వహించారు. నమా జ్ అనంతరం ముస్లింలు ఒకరినొకరు కౌగిలించుకుని ‘ఈద్ ముబారక్‘ అంటూ పం డుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఘట్కేసర్ పరిధిలోని ఈద్గా వద్ద ముస్లింలకు శు భాకాంక్షలు తెలపడానికి స్థానిక రాజకీయ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు విచ్చేశారు. వారు ముస్లిం పెద్దలను శాలువాలతో సత్కరించి, ఘట్కేసర్లో ఉన్న మతసామరస్యానికి ఈ పండుగే నిదర్శనమని కొనియాడారు. పండుగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు ఘట్కేసర్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈద్గాల వద్ద, ప్రధాన కూడళ్లలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.