2 July, 2026 | 1:17 AM

బీఎస్సీ ఫారెస్ట్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం

02-07-2026 12:00 AM

జూలై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ

టీజీ ఈఏపీసెట్ 2026 అర్హులకు అవకాశం

గజ్వేల్, జూలై 1: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఐసీఏఆర్, ఐసీఎఫ్‌ఆర్‌ఈ గుర్తింపు పొందిన ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ సిఆర్‌ఐ)లో 202627 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు కళాశాల వర్గాలు వెల్లడించాయి.

దరఖాస్తులను జూలై 1 నుంచి జూలై 25, 2026 వ రకు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఇంట ర్మీడియట్ (10+2) లేదా సమానమైన పరీక్షలో బైపీసీ, ఎంబైపీసీ లేదా ఎంపీసీ గ్రూపులలో ఉత్తీర్ణత సాధించి, టీజీ ఈఏపీ సెట్2026లో అర్హత పొందిన విద్యార్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ కోర్సులో అటవీ సంరక్షణ, జీవ వైవిధ్యం, వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ నిర్వహణ, అగ్రో ఫారెస్ట్రీ, వాతావరణ మార్పులు, సహజ వనరుల పరిరక్షణ వంటి అంశాల్లో నాణ్యమైన విద్యతో పాటు ప్రయోగశాల శిక్షణ, ఫీల్ విజిట్లు, అధ్యయన పర్యటనలు, ప్రాక్టికల్ శిక్షణ అందించనున్నట్లు కళాశాల అధికారులు తెలిపారు. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, స్టేట్ ఫారెస్ట్ సర్వీసెస్, అటవీ పరిశోధనా సంస్థలు, వన్యప్రాణి సంరక్షణ సంస్థలు, పర్యావరణ కన్సల్టెన్సీలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో విస్తృత ఉద్యోగా వకాశాలు లభిస్తాయని కళాశాల డీన్ ప్రవీణ తెలిపారు.

అటవీ, పర్యావరణ రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలను కునే అర్హు లైన విద్యార్థులు  జూలై 25లోపు దరఖాస్తు చేసుకోవా లన్నారు. అలాగే తల్లిదండ్రులు, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రవే శాల సమాచా రాన్ని ఎక్కువ మంది విద్యా ర్థులకు చేరేలా విస్తృత ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం www.fcrihyd.in వ్బుసైట్ను సంద ర్శించాలని సూచించారు. మరిన్ని వివరాల కు 63038 271100, 08454-211 939, 08454-211930 నంబర్లను సంప్రదించ వచ్చని లేదా fcriadmissions@gmai l.comకు ఈ-మెయిల్ చేయవచ్చని తెలిపారు.