2 July, 2026 | 1:10 AM

ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా వ్యవహరించాలి: మంత్రి వివేక్

02-07-2026 12:00 AM

రామచంద్రపురం, జూలై 1: ఓటర్ల సమగ్ర జాబితా సవరణలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రామచంద్రాపురం డివిజన్ పరిధి  బాలాజీ గార్డెన్స్లో  పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్.ఐ.ఆర్  అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి.ఎల్.ఎ లకు ఫారం6, ఫారం7, ఫారం8 దరఖాస్తుల వినియోగం, 2002 ఓటర్ల డేటా మ్యాపింగ్, ఓటర్ల జాబితా సవరణలో అనుసరించాల్సిన ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమంలో  పార్లమెంట్ కో ఆర్డినేటర్ వెన్నెల, డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, మాజీ కార్పొరేటర్ పుష్ప నాగేష్తో పాటు కాంగ్రెస్ నాయకులు, బి.ఎల్.ఎలు పాల్గొన్నారు.