24 June, 2026 | 2:26 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలి

11-06-2025 06:32 PM

తాడ్వాయి (విజయక్రాంతి): భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలని తాడ్వాయి తహశీల్దార్ శ్వేత(Tehsildar Shweta) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో బుధవారం భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రైతులు ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. భూమి రికార్డుల్లో నమోదు కాకున్నా, కొత్త పాస్ పుస్తకాలు రాకున్నా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు చెన్నారెడ్డి, రాధాకృష్ణ, సంజీవ్, బలరాం, సుమలత తదితరులు పాల్గొన్నారు.