24 June, 2026 | 4:13 PM

నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు నూతన మండల అధ్యక్షుల నియామకం

24-06-2026 03:08 PM

 చిట్యాల, జూన్ 24 (విజయ క్రాంతి) : నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నూతన మండల, టౌన్ అధ్యక్షుల నియామక కార్యక్రమంలో  ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత నియామక పత్రాలను బుధవారం అందజేశారు. నకిరేకల్ మండల అధ్యక్షుడిగా గాదగోని కొండయ్య, టౌన్ అధ్యక్షుడిగా లింగాల వెంకన్న, కేతేపల్లి మండల అధ్యక్షుడిగా ఎడ్ల ప్రవీణ్, కట్టంగూర్ మండల అధ్యక్షుడిగా సుంకరబోయిన వెంకన్న, నార్కట్‌పల్లి మండల అధ్యక్షుడిగా గాయం శ్యామ్ సుందర్ రెడ్డి, చిట్యాల మండల అధ్యక్షుడిగా జడల చిన్న మల్లయ్య, చిట్యాల టౌన్ అధ్యక్షుడిగా ఎద్దులపూరి కృష్ణ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ సీనియర్ నాయకుల సలహాలు తీసుకుంటూ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని సూచించారు. అలాగే ఓటర్ల జాబితా సవరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు, ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, మాజీ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం, తాళ్ల వెళ్ళాంల గ్రామ మాజీ సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.