11 July, 2026 | 8:34 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

ఆయిల్ ఫామ్ తోటలతో అధిక లాభాలు

10-07-2026 06:25 PM

- కుకునూరు పల్లి ఏవో గోవిందరాజు

కొండపాక: కుకునూరు పల్లి మండలం తిప్పారం గ్రామంలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ (ఎన్ఎమ్ఇఓ -ఓపి ) కార్యక్రమాన్ని కుక్కునూరు పల్లి మండల అగ్రికల్చర్ అధికారి గోవిందరాజు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిప్పారం గ్రామానికి చెందిన రైతు సోమలేటి వరలక్ష్మి తన మూడు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. రైతులు పంటల విద్యుదీకరణతో పాటు అధిక ఆదాయం పొందేలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న జాతీయ తినదగిన నూనెల మిషన్ ఆయిల్ ఫామ్ (ఎన్ఎమ్ఇఓ -ఓపి ) పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తిప్పారం గ్రామ సర్పంచ్ భద్రప్ప, మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు సూచించారు. ఆయిల్ ఫామ్ సాగు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం లభిస్తుంది. ప్రభుత్వం సాంకేతిక సలహాలు, మొక్కలు, వివిధ రకాల ప్రోత్సాహకాలను అందిస్తుందని అర్హులైన రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీహరి, ఆయిల్ఫేడ్ ఫీల్ ఆఫీసర్ రాజు, సుధాకర్, డ్రిప్పు అధికారి శ్రీనివాస్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.