calender_icon.png 2 February, 2026 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఆర్పీ కార్యదర్శుల నియామకం

02-02-2026 12:00:00 AM

పార్టీలో భారీగా చేరికలు

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర పరిధిలోని ముషీరాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల లో టీఆర్పీ డివిజన్ ప్రధాన కార్యదర్శుల నియామకం పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్ల న్న సమక్షంలో ఆదివారం జరిగింది. టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ ఇంచా ర్జి ఆర్ భావనవెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ రంగరాజు అనిల్ కుమార్ పటే ల్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి కిషోర్ కుమార్‌గౌడ్, వ్యవస్థాపక కార్యదర్శి సందీప్ రావి పాటి సంయు క్తంగా నిర్వహించారు.

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, కార్యకర్తలను సమన్వయం చేస్తూ బీసీ సమాజ హక్కుల పోరాటాన్ని బలోపేతం చేయడంలో నూతనంగా నియమితు లైన నాయకులు కృషి చేయాలని పార్టీ అధ్యక్షు లు మల్లన్న గారు సూచించారు. అలాగే ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం బిల్యా నాయక్ తండా, బద్దు తండా గ్రామ పంచాయతీల బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులు, యూత్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఆ పార్టీకి రాజీ నామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.

భువనగిరి జిల్లా ఇంచార్జి కొమ్రిశెట్టి నర్సింహులు, రాష్ట్ర నాయకులు బీకు నాయక్, మోత్కుపల్లి రఘు ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో టీఆర్పీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో గూగులోత్ చిన్న, బుక్య కృష్ణ, మహేందర్, శ్రీకాంత్ భుక్య శ్రీకాంత్, గూగులోత్ రాజు, భూక్య లింగ, నరసింహ, భూక్య సుమన్, నరేంద్ర, మురళి, కిషన్, శ్రీను, రాములు, రాజేష్, నరేందర్, రఘు, నితిన్, శ్రీరామ్, శ్రీహరి, మహేష్, లావుడియా లోజన్ సింగ్ నాయక్ ఉన్నారు.