calender_icon.png 2 February, 2026 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్యులే దేశ ఆర్థిక వెన్నెముక

02-02-2026 12:00:00 AM

  1. దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన అసలైన ఆర్కిటెక్ట్స్
  2. ఆలిండియా ఆర్యవైశ్య ఇండస్ట్రియలిస్ట్ ఫోరం సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ఆర్యవైశ్యులు అంటే ఒక కమ్యూనిటీ మాత్రమే కాదని ఈ దేశానికి ఆర్థిక వెన్నెముక, అసలైన ‘వెల్త్ క్రియేటర్స్’ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నా రు. ఆదివారం హైదరాబాద్‌లో ఆలిండియా ఆర్యవైశ్య ఇండస్ట్రియలిస్ట్ ఫోరం సిల్వర్ జూబ్లీ సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ‘ఎకనామిక్స్’ అనే పదం పుట్టకముందే, మార్కెట్ అనే కాన్సెప్ట్ ప్రపంచానికి తెలియకముందే, దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన అసలైన ఆర్కిటెక్ట్స్ ఆర్యవైశ్యులేనని చెప్పారు.

ప్రపంచం మొత్తం ఇప్పుడు స్టార్టప్‌ల గురించి మాట్లాడుతున్నా వందల ఏళ్ల క్రితమే ఎలాంటి సపోర్ట్ లేకుండా వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించిన అసలైన ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్యవైశ్యులేనని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ వంటి ఆధునిక టెక్నాలజీలు కేవలం ఐటీ కంపెనీలకే కాకుండా సంప్రదాయ వ్యాపారాలను ‘స్మార్ట్ బిజినెస్‌లు’గా మార్చడానికి ఉపయోగపడతాయని మంత్రి వివరించారు.

గత రెండేళ్ల లో తెలంగాణ పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంలా మారిందని, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా ప్రపంచం దష్టిని ఆకర్షిస్తోందని మంత్రి అన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో పాటు ‘పీస్ ఆఫ్ డూయింగ్ బిజినె స్’అందిస్తున్న ప్రో-బిజినెస్ ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. ‘లోకల్ ప్రొడక్షన్ టు గ్లోబల్ డామినేషన్’ లక్ష్యంగా తెలంగాణను ప్రపంచ పారిశ్రామిక పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ ధ్యేయమన్నా రు. ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ట్యాగ్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో క్వాలిటీ బెంచ్‌మార్క్‌గా మార్చాలన్నదే లక్ష్యమని చెప్పారు.

ఆర్యవైశ్యులు ఇక మైక్రో లెవల్ ఆలోచనలకే పరి మితం కాకుండా మ్యాక్రో లెవల్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని సూచించారు. ఇన్నోవేటివ్, డిస్క్రిప్టివ్ ప్రాజెక్ట్‌లతో ముందు కు రావాలని, ప్రభుత్వమే పూర్తి మద్దతుగా ఉం టుందని హామీ ఇచ్చారు. సిల్వర్ జూబ్లీ దాటి గోల్డెన్ జూబ్లీ దిశగా ఆర్యవైశ్యుల ప్ర యాణం కొనసాగాలని, తెలంగాణ అభివద్ధి లో వారి భాగస్వామ్యం ఎప్పటికీ కీలకంగా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు.