4 July, 2026 | 8:50 PM

Breaking News

దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •   కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు   •  

పారదర్శకంగానే జడ్జిల నియామకాలు

25-11-2024 02:46 AM
  1. కొలిజియంపై అపోహలను తొలగించాలి
  2. మాజీ సీజేఐ చంద్రచూడ్

న్యూఢిల్లీ, నవంబర్ 24: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జిల నియామ కంలో కొలిజియం వ్యవస్థపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉం దని మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఎన్డీటీవీ నిర్వహించిన ‘సంవిధాన్@75 కాంక్లేవ్’ సదస్సు లో మాట్లాడుతూ.. జడ్జ్జిల నియామకాలు మరింత పారదర్శకంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.

న్యాయమూర్తుల నియామకం వివిధ దశల్లో జరుగుతుందని, ఏకపక్షంగా సుప్రీం నిర్ణయం తీసుకోదని తెలిపారు. ఒక న్యాయమూర్తిని నియమించేటప్పుడు ఇంటెలిజెన్స్ నివేదకలపైనే కాకుండా, సీఎంలు,గవర్నర్ల ఒపీనియన్స్ కూడా తీసుకుం టామని పేర్కొన్నారు.

వివిధ వర్గాలు, ప్రాంతాలకు, వారి సీనియారిటీ, నిబద్ధత, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని, ఇందుకోసం సుప్రీంకోర్టు నిబంధనలు పెట్టిందని వెల్ల డించారు.  కొలిజియంకు కొన్ని బాధ్యతలు అప్పగించారని వాటి ప్రకారమే నడుచుకుంటామన్నారు.