కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు
మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు నియామకమైన కొత్త పాలవర్గాలు శనివారం కొలువుదీరాయి. తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల, నుస్తులాపూర్, శంకరపట్నం మండలం తాడికల్, మెట్ పల్లి, గద్దపాక సింగిల్ విండోలకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి.
పోరండ్లలో..
పోరండ్ల సొసైటీ చైర్మన్ గా గోపు మల్లారెడ్డి, డైరెక్టర్లుగా జాల లక్ష్మి, ఐతం వెంకటయ్య, పెండ్యాల కొండల్ రెడ్డి, పైడిపల్లి స్వామి, మాదన అంజయ్య, బొజ్జ పరుషరాములు, యాళ్ల రమ, బి.ఎల్లయ్య, సింగిరెడ్డి నర్సింహారెడ్డి, సుధగోని ఆంజనేయులు, జేజెల కనుకమ్మ, పారునంది దుర్గయ్యలు ప్రమాణం చేశారు.
నుస్తులాపూర్ లో...
నుస్తులాపూర్ సింగిల్ విండో కొత్త కార్యవర్గం కొలువుదీరింది. చైర్మన్ గా మోరపల్లి రమణారెడ్డి, డైరెక్టర్లుగా జక్కుల కేశవులు,పాకాల మంజుల, కాసర్ల సంపత్, గుంటి వేణు, పోల్సాని సత్యనారాయణరావు, కెంసారపు రాజయ్య, పొన్నాల చిరంజీవి, కొమ్మెర మల్లారెడ్డి, ఇనుకొండ వీరచంద్రారెడ్డి, నరహరి సుధాకర్ రెడ్డి, తమ్మనవేణి రాములు యాదవ్, ఉప్పులేటి శాంతమ్మలు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, మాజీ ఎంపీపీలు కుంట రాజేందర్ రెడ్డి, శ్రీగిరి రంగారావు, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మామిడి అనిల్ కుమార్, బుధారపు శ్రీనివాస్,సిరిగినేని కొండల్ రావు,కొత్త తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాడికల్ లో...
తాడికల్ సింగిల్ విండో చైర్మన్ గా కీసర సంపత్, డైరెక్టర్లుగా కల్లెపల్లి రాజయ్య,తుమ్మేటి కొండల్ రెడ్డి, గీట్ల గోపాల్ రెడ్డి, సంబు తిరుపతి, గాజుల లస్మవ్వ, సుద్దాల రాజేందర్, జనగాం రాజయ్య,తిరుపతి సమ్మయ్య, పింగళి జయలక్ష్మి, తాళ్లపల్లి కొమురయ్య ఓదెల రాజయ్య , కలకుంట్ల సత్యనారాయణ రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ,పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, పార్టీ నాయకులు దుర్గం తిరుపతి,అజయ్ తోపాటు పలువురు సర్పంచులు, పార్టీ గ్రామశాఖల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
మెట్ పల్లిలో...
మెట్ పల్లి సింగిల్ విండో పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. చైర్మన్ గా గాజుల మహేశ్, డైరెక్టర్లుగా పొన్నోజు సదానందం, నాంపెల్లి శ్రీనివాస్ ,పెద్ది ముత్తారెడ్డి, అంబాల కోటి , గాజుల నిర్మల, బొల్లిపల్లి శ్రీనివాస్ , అంగిడి సారయ్య, బొమ్మెన గట్టయ్య ,దుబ్బాల సమ్మక్క ప్రమాణ స్వీకారం చేశారు. మెట్పల్లి సింగిల్ విండో ముఖ్యకార్యనిర్వహణాధికారి సదయ్య వీరిచేత ప్రమాణం చేయించారు.
గద్దపాకలో...
గద్దపాక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన పాలకవర్గం శనివారం ప్రమాణస్వీకారం చేసింది. చైర్మన్ గా గోపగోని బస్వయ్య గౌడ్, డైరెక్టర్లుగా చింతిరెడ్డి రాజిరెడ్డి, రేవెల్లె ఓదెలు, పలకల కరుణాకర్ రెడ్డి, బైకం సతీష్. శనిగరపు రాజు, గాజుల రాజేశ్వరి, గట్టు రాధ, మేచినేని రామారావు, గుర్రం మహేందర్, ఎం.యాదయ్య, పోరెడ్డి స్వరూప, పెసరు మల్లేశం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా సహకారశాక ఆడిటర్ తిరుమల్ రావు వారిచేత ప్రమాణం చేయించారు.






