27 August, 2026 | 5:00 AM

ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి

04-07-2026 08:12 PM

మండల పరిధిలో రూ.1.58 కోట్లతో 17 అభివృద్ధి పనులకు శ్రీకారం

అభివృద్ధి పనులపై అధికారులు నిత్యం పర్యవేక్షించాలి

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

పాల్వంచ,(విజయక్రాంతి): ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ మండల పరిధిలోని వివిధ పథకాలు, గ్రాంట్ల రూపంలో విడుదలైన రూ. 1.58 కోట్లతో నిధులతో చేపట్టనున్న 17 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజల అవసరాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, ప్రాధాన్యతా క్రమంలోనే పనులను చేపడుతూ నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామం, పంచాయతి కేంద్రాలలో హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గ్రామపంచాయతి కార్యాలయాలు, కమ్యూనిస్టుయి హాళ్లు, ప్రభుత్వ సేవాకేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోందని తెలిపారు.