కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది
విద్యార్థులు లక్ష్యం వైపు పయనించేలా చదవాలి
బెస్ట్ రన్నర్ ఫౌండర్ కోలేటి సతీష్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): కొత్తదనం ఎప్పుడు ఉత్సాహాన్ని అందిస్తుందని బెస్ట్ రన్నర్ ఆర్గనైజేషన్ ఫౌండర్ కోలేటి సతీష్, పలువురు విశిష్ట అతిధులు పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ మండల కేంద్రంలో బెస్ట్ రన్నర్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల పూర్తిగా కలర్లు వెలసిపోయి ఉండడంతో బెస్ట్ రన్నర్ ఆర్గనైజేషన్ ను సంప్రదించగా రెండు లక్షలపై చిలుకు రూపాయలతో బాలికల పాఠశాలకు పూర్తి స్థాయిలో నూతన రంగులు వేయించి అధునాతనంగా తీర్చిదిద్దడం అభినందనీయం అన్నారు.
విద్యార్థులకు కొత్తదనం ఎప్పుడూ చక్కటిఉత్సాహాన్ని అందిస్తుందని ఆ ఉత్సాహంతో విద్యార్థులు చక్కటి విద్యలో రాణించి ఉజ్వల భవిష్యత్తుకు పాటలు వేసుకోవాలని అన్నారు. బెస్ట్ రన్నర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకొని ఆ పాఠశాలలో మౌలిక సదుపాయాలకు కృషి చేయడం చక్కటి గర్వించదగ్గ విషయం అన్నారు. కార్పొరేట్ విద్యాలయాలలోచదువుకునే విద్యార్థులు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణిస్తున్నారని ఇలాంటి ప్రోత్సాహకాలు అందించే వారికి ఎప్పుడు పాఠశాలలు కృతజ్ఞతా భావంతో ఉంటాయని పేర్కొన్నారు.
2011 ప్రారంభమైన బెస్ట్ రన్నర్ వందలాది పాఠశాలలకు సేవలందించడం ఆనందంగా ఉందన్నారు. సేవ చేయాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు అందించేందుకు దోహద పడతానని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో విద్యార్థులు భవిష్యత్తులో చక్కటి ఉన్నత స్థితిలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఉన్నత విద్యకు సహకారం అందించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని అన్నారు.






