ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు
ఆర్థిక శాఖకు జీవో జారీ
కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తపరిచిన అవుట్ సోర్ సింగ్ ఉద్యోగులు
గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు
కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కు ఒకటో తారీఖున జీతాలు పడే విధంగా, ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వడం నిజంగా సంతోషంగా ఉందని, తెలంగాణ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఇవాళ గ్రంథాలయంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ... పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్లకు ఏ ఇబ్బంది వచ్చిన, కాపాడే ది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. అలాగే ఏ ఉద్యోగికి ఆపద వచ్చిన కూడా కాపాడుకుంటామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 20 సంవత్సరాలుగా రాజకీయాలకు వచ్చిన సందర్భంగా,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జిల్లా గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.






