పింగిళి కళాశాల ప్రిన్సిపాల్ కు ప్రశంసలు
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి ని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. యోగితారానా, కళాశాల విద్యా కమీషనర్ శ్రీదేవసేన అభినందనలు తెలియజేస్తూ సన్మానించారు. హైదరాబాద్ లోని మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ లకు ఈ నెల 29, 30 తేదీలలో జరిగిన రెండురోజుల రాష్ట్ర స్థాయి ప్రిన్సిపాల్స్ సమావేశ కార్యక్రమంలో నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను, పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ పీజీ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ సాధించడంలో కృషి చేసినందుకు, రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీలలో జూవాలజీ, కెమిస్ట్రీ, హిస్టరీ విభాగాలలో పింగళి కళాశాలకు మూడు ప్రథమ బహుమతులు సాధించిన సందర్భంగా ప్రిన్సిపాల్ ను అభినందించి, సన్మానించారు.




