17 July, 2026 | 5:21 AM

ఏఆర్ కానిస్టేబుల్ సస్పెండ్

23-06-2024 12:05 AM

సిద్దిపేట రూరల్, జూన్ 22: డిపార్ట్‌మెంట్ నియమాలను అతిక్రమించ డంతో పాటు క్రమశిక్షణా రహితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో ఏఆర్ కానిస్టేబుల్ పీ గురునానక్‌ను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట సీపీ డాక్టర్ అనురాధ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రమ శిక్షణా రహితంగా విధులు నిర్వహించే అధికారులను, సిబ్బందిని ఉపేక్షించేది లేదని సీపీ హెచ్చరించారు.