10-01-2026 12:00:00 AM
ఆర్థిక ఇబ్బందులే కారణమనే అనుమానం
శేరిలింగంపల్లి,జనవరి 9 (విజయక్రాంతి): మాదాపూర్‌లోని విట్టాలరావు నగ ర్లో ఫ్రెష్ లీవింగ్ సర్వీస్ అపార్ట్‌మెంట్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. శుక్రవారం పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, బాత్ టవల్ సాయంతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. మృతుడిగా కరీంనగర్‌కు చెందిన బొమ్మల అనుదీప్ కుమార్ (32)గా నిర్ధారించారు. వృత్తిరీత్యా ఆర్కిటెక్చర్‌కు సంబంధిం చిన వ్యాపారం చేస్తున్న అనుదీప్ ఈ నెల 5న సదరు సర్వీస్ అపార్ట్మెంట్లోకి వచ్చి ఒంటరిగా గదిలో నివసిస్తున్నాడు.
శుక్ర వారం ఉదయం తన స్నేహితుడు హరీశ్‌కు సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు వచ్చి పికప్ చేసుకోమని వాట్సాప్‌లో సందేశం పంపాడని, హరీష్ అక్కడికి చేరుకుని గది తెరిచి చూడగా అనుదీప్ ఉరేసుకుని కనిపించడంతో వెంట నే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గది లో సూసైడ్ నోట్ లభ్యమవడంతో ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తు న్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.