11-01-2026 10:29:02 AM
200 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలంలోని దాస్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని మంగళ్ తండా గ్రామం పాయంవారి గుంపులో శనివారం రాత్రి సుమారుగా 200 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారి జి వెంకటకృష్ణ తన బృందంతో పట్టుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి రేషన్ బియ్యాన్ని తరలించడం జరుగుతుందని ఈ రేషన్ బియ్యం ఎవరిది అనేది తెలియాల్సి ఉందని పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు అందించవలసిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై ఆర్ఐ ఎన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.