10-01-2026 12:00:00 AM
ఎంఎస్‌ఎంఈ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డేనియల్ మండల
ముషీరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ప్రోత్సాహకాలు తక్షణమే విడుదల చేయాలని ఎంఎస్‌ఎంఈ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డేనియల్ మండల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహకాలు రూ. 1000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎం. ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి మాధవి, సంయుక్త కార్యదర్శి ఎస్. గణేష్ తదితరులు పాల్గొన్నారు.