11-01-2026 10:25:07 AM
హన్మకొండలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
మంథని,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలని, (వీబీజీ) రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు డిమాండ్ చేశారు. హన్మకొండ డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగుల వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నియోజవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. (వీబీజీ) రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. ప్రజలకు ఉపాధి హక్కును, గ్రామ పంచాయతీలకు పాలనా హక్కులను తిరిగి కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా పేర్కొన్నారు.