కేసీఆర్, రేవంత్‌లు చర్చకు సిద్ధమా?
- వారు రాష్ట్రాన్ని పీల్చి పిప్పిచేశారు..
- 23న జన్ ఆక్రోష్ పాదయాత్ర
- జీహెచ్‌ఎంసీ ఆఫీసు నుంచి ఇందిరా పార్క్ వరకు
- బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): కేంద్రం కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టమంటే అడ్డుకున్నామని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని, ఈ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు సవాలు విసిరారు. బీఆర్‌ఎస్ పాలనలో లక్షల కోట్ల అప్పులు పెట్టార ని, కేసీఆర్, రేవంత్‌రెడ్డి ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని పీల్చి పిప్పిచేశాయంటూ ఆయన మండిపడ్డారు.
గత ప్రభుత్వ అప్పులపై, సీఎం రేవంత్‌రెడ్డి చెప్పే లెక్కలపై కూడా తాను బహిరంగ చర్చకు సిద్ధమని వారికి ఆయన సవాల్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగిత్యాలలో బీఆర్‌ఎస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ సభలో కేసీఆర్, రేవంత్‌రెడ్డి మాటల్లో భయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఒకరు ‘నేను మళ్లీ అధికారంలోకి వస్తాను’ అంటున్నారు, మరొకరు ‘ఇవ్వాళ్టి పరిస్థితి మారుతుంది’ అంటున్నారని, కానీ జగిత్యా ల, భూపాలపల్లి సభల్లో ఇద్దరు నేతలు కూడా బీజేపీని టార్గె ట్ చేయడం వాళ్లలో ఉన్న భయాన్ని స్పష్టంగా బయటపెడుతోందన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వ మే అన్న వాస్తవం వాళ్లను కలవరపెడుతోందని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీల్లో లోపాలు జరిగాయని మేం గతంలోనే ప్రశ్నించామని, సీబీఐ విచారణ జరపా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. కానీ రేవంత్ సర్కార్ ఇప్పటికీ పూర్తిస్థాయి విచారణ కోరడం లేదని.. కేసీఆర్, రేవంత్ మధ్య పరస్పర రక్షణ రాజకీయాలు నడుస్తున్నాయని రాంచందర్‌రావు ఆరోపించారు.
బీజేపీ పెరుగుదలను చూసి ఓర్చుకో లేక ఈ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని, ఒకరినొకరు విమర్శిం చుకుంటున్నట్లు నటిస్తూనే, లోపల మాత్రం అవినీతి నుంచి ఒకరికొకరు కాపాడుకుంటున్నారని ఆయన చెప్పారు. ఓటుకు నోటు కేసులో రక్షించుకున్నట్లే, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి విషయంలోనూ అదే చేస్తున్నారని విమర్శించారు.
ఈ విషయంలో ప్రజలకు వారు చెవిలో పూలు పెడుతున్నారని అన్నారు. అయితే తెలంగాణ ప్రజలు మీ నిజస్వరూపాన్ని అర్థం చేసుకున్నారని, నిన్నటి సభల వల్ల రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉండదని రాంచందర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది కేవలం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
23న జన్ ఆక్రోష్ పాదయాత్ర
ఈనెల 23న హైదరాబాద్‌లో జన్ ఆక్రోష్ పాదయాత్రను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని రాంచందర్ రావు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ ఆఫీసు నుంచి మొదలై దోమల్‌గూడ, ఇందిరా పార్క్ వరకు కొనసాగే ఈ యాత్రలో మహిళలు పెద్దఎత్తున పాల్గొని కాంగ్రెస్ మహిళా వ్యతిరేక ఆలోచనలను, విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ యాత్ర ముగింపులో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం చేసిన చారిత్రాత్మక కృషిపై ప్రసంగాలు ఉంటాయని తెలిపారు.
ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. దశాబ్దాల కాలంగా మహిళా రిజర్వేషన్ల అంశాన్ని అటకెక్కించి, నారీ శక్తి ఎదుగుదలను అడ్డుకున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అసలు రంగును ఎండగట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో సాహసోపేతంగా నారీ శక్తి వందన్ అధినియమ్‌ను తీసుకువచ్చి మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పిస్తుంటే, దానిని కూడా రాజకీయం చేస్తూ అడ్డుకున్న కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీల తీరు దురదృష్టకరమన్నారు.
వారి కపటబుద్ధికి వ్యతిరేకంగా, తెలంగాణ నారీ లోకం గళం ఎత్తుతోందని, ఈ నేపథ్యంలోనే మహిళలకు మద్దతుగా నిలుస్తూ తెలంగాణవ్యాప్తంగా భారీఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ జన్ ఆక్రోష్ పాదయాత్రలో పెద్దఎత్తున మహిళలు, ప్రజలు పాల్గొని దిగ్విజయం చేసి, ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం, వారి రాజకీయ హక్కుల కోసం జరిగే పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు.






