15 August, 2026 | 3:40 PM

అందరి సంక్షేమం మోడీ ప్రభుత్వ ధ్యేయం

15-08-2026 02:55 PM

భైంసా ,ఆగస్టు 14 (విజయక్రాంతి): దేశంలో అందరి సంక్షేమమే మోడీ ప్రభుత్వ దేయమని అందుకే ప్రభుత్వం సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళుతుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందిన భారత్ 80 ఏళ్లలో అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. అనంతరం భైంసా బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.