అభివృద్ధిపై చర్చకు సిద్ధమా
పినపాక నియోజకవర్గం బిబ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి
బూర్గంపాడు,నవంబర్7,(విజయక్రాంతి): పినపాక నియోజకవర్గ అభివృద్ధి, బూర్గంపాడు మండల అభివృద్ధిపై పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం బి బ్లాక్ మహిళా అధ్యక్షురా లు బర్ల నాగమణి సవాలు విసిరారు. మండల కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స మావేశంలో ఆమె మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం తమ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత నుంచి సోషల్ మీడియా వేదికగా తమ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పై అవాకులు చవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ప్రజల ఓటుతో గెలిచిన పాయంను విమర్శించే అర్హత నీకు లేదని అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ఆ చర్చలో తానే పాల్గొంటానని అభివృద్ధిపై బహిరంగ చర్చ లో తేల్చుకుందామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో చేయలేని అభివృద్ధి 20 నెలల్లో తమ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేసి చూపించారని తెలియజేశారు.ఈ సమావేశంలో మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




