calender_icon.png 8 November, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండ్ల సింగారం ఇసుక ర్యాంపుపై విచారణ జరిపించాలి

08-11-2025 12:25:39 AM

రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు సరోజ 

మణుగూరు, నవంబర్ 7(విజయక్రాంతి) : ఏజెన్సీ చట్టాలను అతిక్రమిస్తూ, ఆదివాసి హక్కులను కాలరాస్తున్న వారి పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.మండలంలోని సహజ వనరులను దోచుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయ న్నారు. గత కొన్ని ఏళ్లు క్రితం సింగరేణి ఓసీలోతో కనమరుగైన గుండ్ల సిం గారం గ్రామం పేరుతో ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేసి ఆదివాసీ సమాజాన్ని, ఏజెన్సీ చట్టాలను అధికారులు, ర్యాంపు నిర్వాహకులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

20 సంవత్సరాల క్రిత మే సింగరేణి ఓసితో గ్రామం కాలగర్భంలో కలిసిపోయిందన్నారు. కానీ నేడు అదే గ్రామం పేరు తో అధికారులు ఇసుక ర్యాంపుకు అనుమతులు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు.గుండ్ల సింగారంర్యాంపు పేరుతో కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను భారీ యంత్రాలతో డంపింగ్ చేసారన్నారు. దానికి టీఎస్‌ఎన్‌ఎండిసి అధికారులు ఏ రకంగా అనుమతులు ఇచ్చారని నిలదీశారు. అమైండ్మెంట్ యాక్ట్ , పీసా చట్టం ప్రకారంగా ఆ గ్రామాన్ని కనీసం సందర్శించకుండా, పీసా గ్రామసభ అనుమతి లేకుండా ఇసుక ర్యాంపు పై అధికారులు ఏ రకంగా సంతకం పెట్టారని. మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ఎలా సంతకాలు చేసి పర్మిషన్ లు ఇచ్చారన్నారు.

అక్రమంగా అనుమతులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఊరును మాకు చూపెట్టాలని సవాల్ చేశారు. లేనిచో సర్వే భవన్ నుండి మ్యాప్ లు తెప్పించి అధికారులపై హై కోర్టులో కేసులు వేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఎండి షబానా, శ్యామల, సుజాత, వసంత, శైలజ, రేణుక సౌజన్య పాల్గొన్నారు.