calender_icon.png 8 November, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ

08-11-2025 12:35:07 AM

జిన్నారం, నవంబర్ 7 :గడ్డపోతారం మున్సిపల్ కేంద్రంలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి గూడెం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక అయ్యప్ప స్వాములు, భక్తులతో కలిసి మధుసూదన్ రెడ్డి అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా నిరహించిన హోమం, ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు మధుసూదన్ రెడ్డి తెలిపారు. నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శంకర్, మాణిక్యం, మాజీ సర్పంచ్ అశోక్, బాలుగారి శ్రీనివాస్, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.