25 June, 2026 | 1:34 AM

అర్జున్ విజయం

06-11-2024 12:00 AM

చెన్నై: భారత్ టాప్ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో శుభారంభం చేశాడు. మన దేశానికే చెందిన గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీతో జరిగిన ఐదు గంటల మారథాన్ పోరులో తెలంగాణ కుర్రాడు అద్బుత ప్రదర్శనతో విజయం దక్కించుకున్నాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో రౌనక్ సద్వానీ, మాక్సిమే లాగ్రేవ్, లియోన్ మెండోనక విజయాలు సాధించగా.. ద్రోణవల్లి హారిక, ఆర్. వైశాలీ పరాజయం చవిచూశారు. వరల్డ్ చాంపియన్‌షిప్ సందర్భంగా గుకేశ్ ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు.