16 March, 2026 | 9:40 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

టాప్-10 లో హర్మన్‌ప్రీత్

06-11-2024 12:00 AM

నాలుగో ర్యాంకులో మంధాన

దుబాయ్: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మెరిసింది. బ్యాటింగ్ విభాగంలో హర్మన్ మూడు స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంకు లో నిలిచింది. ఇటీవలే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆఖరి వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ తాజా ర్యాంకింగ్స్‌లో టాప్ అడుగుపెట్టింది. మరో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన నాలుగో ర్యాంకును కాపాడుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్ బర్ట్న్ తొలి స్థానంలో నిలిచింది. భారత వికెట్ కీపర్ యస్తికా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 45వ ర్యాంకుకు చేరుకుంది.

బౌలర్ల విభాగంలో భారత్‌కు చెందిన దీప్తి శర్మ 703 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. పేసర్ రేణుకా సింగ్ నాలుగు స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో, లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా 77 స్థానాలు ఎగబాకి 83వ స్థానంలో, సైమా 20 స్థానాలు మెరుగుపర్చుకొని 77వ స్థానంలో నిలిచారు.