14-11-2025 12:00:00 AM
పనాజీ, నవంబర్ 13 :చెస్ ప్రపంచకప్‌లో భారత క్రీడాకారుల హవా కొనసాగు తోంది. స్టార్ ప్లేయర్స్ అర్జున్ ఎరిగైసి, పెం టేల హరికృష్ణ ప్రీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. నాలుగో రౌండ్ టై బ్రేకర్‌లో అర్జున్ 3 తేడాతో హంగేరికి చెందిన పీటర్ లెకో పై విజయం సాధించాడు.
ప్రీక్వార్టర్ ఫైనల్లో అర్జున్ ఎరిగైసి అమెరికాకు చెందిన లివాన్ అరోనియన్‌తో తలపడనున్నాడు. మరో మ్యాచ్‌లో హరికృష్ణ స్వీడన్‌కు చెందిన నిల్స్ గ్రాండ్యులస్‌పై 2.5 స్కోర్‌తో గెలిచి ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మరోవైపు ఆర్. ప్రజ్ఞానంద మాజీ వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్ డానియల్ డుబోవ్(రష్యా) చేతిలో 2.5 స్కోర్ తేడాతో పరాజయం పాలయ్యాడు.