14-11-2025 12:00:00 AM
ముంబై, నవంబర్ 13 : భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ ట్వంటీ ప్రపంచకప్ ప్రిపరేషన్ కోసం రంజీ ట్రోఫీకి దూరమ య్యాడు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు తెలియజేశాడు. బీసీసీఐ ఆదేశాల ప్రకారం జాతీయ జట్టుకు మ్యాచ్ లు లేనప్పుడు ప్రతీ ప్లేయర్ ఖచ్చితంగా తమ రాష్ట్రాలకు దేశవాళీ క్రికెట్‌లో ఆడాల్సిం దే.
అయితే రంజీ ట్రోఫీ నుంచి తప్పుకున్న సూర్యకుమార్ యాదవ్ విజయ్ హజారే టోర్నీ , సయ్యద్ ముస్తాక్ అలీ టీ ట్వంటీ టోర్నీ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరిలో జరిగే ప్రపంచకప్‌కు ఈ టోర్నీలను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని స్కై భావిస్తున్నాడు. అంతర్జాతీయ టీ ట్వంటీల్లో సూర్యకుమార్ పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్నాడు. ఇటీవల ఆసీస్ టూర్‌లోనూ ఫెయిలయ్యాడు. దీంతో సౌతాఫ్రికా సిరీస్‌తో ఫామ్ అందుకోవాలని స్కై పట్టుదలగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఆల్‌రౌండర్ శివమ్ దూబే కూడా రంజీలకు దూరమయ్యాడు.