14-11-2025 12:00:00 AM
సౌతాఫ్రికా ఏ పై భారత్ ఏ విజయం
రాజ్‌కోట్, నవంబర్ 13 : దక్షిణాఫ్రికా ఏ జట్టుతో జరుగుతున్న అనధికారిక వన్డే సిరీస్‌లో భారత్ ఏ శుభారంభం చేసింది. రాజ్ కోట్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో 4 వికె ట్ల తేడాతో సఫారీలను ఓడించింది. అర్షదీప్‌సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ దెబ్బకు సౌతాఫ్రికా ఏ కేవలం 53 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయింది.
టాపార్డర్‌లో ముగ్గురు బ్యాట ర్లు డకౌటయ్యారు. మిడిలార్డర్ బ్యాటర్లు ఫారెస్టర్(77), డి లానో (90), ఫోర్టున్(59) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో సౌతాఫ్రికా ఏ 285/9 చేసింది. ఛేజింగ్‌లో భారత్ ఏ జట్టుకు ఓపెనర్లు రుతురాజ్ గైక్వా డ్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు.
కెప్టెన్ తిలక్ వర్మ(39), నితీశ్ కుమార్‌రెడ్డి(37)తో కలిసి రుతురాజ్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ క్రమంలో రుతురాజ్ (117) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో నిశాంత్ సంధు, హర్షిత్ రాణాతో కలిసి జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఏ 1 ఆధిక్యంలో నిలిచింది.