24 February, 2026 | 10:22 PM

ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

24-02-2026 08:47 PM

సకాలంలో విద్యార్థులు పరీక్షకు హాజరు కావాలి

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపాల్, సీఎస్ మధుకర్ మంగళవారం తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో తెలుగు, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టులకు 239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టులకు 236 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు ప్రిన్సిపాల్ అరుణ తెలిపారు. సకాలంలో విద్యార్థులు పరీక్షకు హాజరుకావాలని ఆయా ప్రిన్సిపాల్ కోరారు.