23 June, 2026 | 11:06 AM

Breaking News

బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ   •   ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడికి సర్పంచ్ కూతురు   •   ముదిరాజ్ సంఘ మాజీ అధ్యక్షుడు వంతడుపుల అలియాస్ గొడుగు నర్సయ్య మృతి   •   ఆధారాలు ఉంటే చూపించండి.. మేము లెక్కలు చూపించడానికి సిద్ధం   •   విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం   •   తెలుగే కదా పండితుడు ఎందుకు అనుకుంటున్నారా?   •   కామారెడ్డిలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్   •   ప్రభుత్వ ఇసుక రీచ్‌పై దాడి.. సైట్ ఇంచార్జీపై దౌర్జన్యం   •   కోరం కనకయ్య వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడినవి: హరిప్రియ నాయక్   •   వ్యభిచారానికి అడ్డు చెప్పిన గ్రామస్తులపై కత్తితో దాడి   •  

హెల్మెట్‌ తప్పనిసరి – ప్రాణ రక్షణకు కీలకం

24-02-2026 08:55 PM

ఏఎస్పీ చిత్తరంజన్

వాంకిడి,(విజయక్రాంతి): అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వాంకిడి మండల కేంద్రంలోని జైత్వాన్ బుద్ధ విహారంలో రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ చిత్తరంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాగోషే పెంటు (బెండార గ్రామం) కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ద్విచక్ర వాహనదారులకు 25 హెల్మెట్లు పంపిణీ చేశారు.

అలాగే మృతుడి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ చిత్తరంజన్ మాట్లాడుతూ... హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువగా ప్రాణనష్టం జరుగుతోందని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.