15 April, 2026 | 1:41 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి

31-10-2025 12:50 AM

గద్వాల, అక్టోబర్ 30 : గద్వాలలో రూ.33.02 కోట్ల నిధులతో నిర్మించిన నర్సింగ్ కళాశాల, వసతి గృహ భవనాల మిగిలి ఉన్న పనులను త్వరగా పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నర్సింగ్ కళాశాలతో పాటు, మెడికల్ కళాశాల విద్యార్థుల వసతిగృహ ఏర్పాట్ల పనులు, ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ నవంబర్ నెలలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చేతులమీదుగా నర్సింగ్ కళాశాల, వసతి గృహ భవనాల ప్రారంభోత్సవం తో పాటు రూ .130 కోట్ల నిధుల అంచనా తో మెడికల్ కళాశాల, వసతి గృహ భవనాల నిర్మాణానికి శంకుస్థా,పన చేయనున్నట్లు తెలిపారు. మెడి కల్ కళాశాల విద్యార్థినిలు ఉండే వసతి గృహంలో ఇంకా అవసరమైన మౌలిక వసతులు ఏమై నా ఉంటే వారంలోగా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు.

మెడికల్ కళాశాల సమీపంలోనే నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవన పనులు కూడా వేగవంతం చేయాలని, త్వరలోనే తాను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తానన్నారు. నర్సింగ్ కళాశాల చుట్టూ ప్రహారీ నిర్మాణం, ఇతర పనులు చేసేందుకు ప్రతిపాదనలు పంపిస్తే అవసరమైన నిధుల మంజూరుకు ప్రభుత్వానికి నివేదిస్తానన్నారు. ఈ సమావేశంలో టీజీఎంఎస్ ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణుగోపాల్, డిప్యూటీ ఈఈ శ్రీనివాసులు, ఏఈ రహీం, మెడికల్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ కవిత, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతమ్మ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిర, తదితరులు పాల్గొన్నారు.