31-10-2025 12:49:12 AM
 
							- బకాయిలను విడుదల చేయాలి
- ఏబీవీపీ నగర కార్యదర్శి యశ్వంత్
జడ్చర్ల అక్టోబర్ 30 (విజయ క్రాంతి):అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జడ్చర్ల శాఖ ఆధ్వర్యంలో డా బీఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను జడ్చర్ల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వాగత ఆర్చి కి వేలాడదీసి దహనం చేశారు. నగర కార్యదర్శి యశ్వంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న నేటికి కూడా ఒక్క రూపాయి కూడా విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని దీంతో అనేక ప్రైవేట్ కళాశాలలు మూతపడి విద్యార్థుల జీవితాలు రోడ్డున పడుతున్నాయన్నారు.
విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.8500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని చెల్లించాల్సిన మొత్తం బకాయిలను చెల్లించకుండా 3,000 కోట్ల రూపాయలను విడతలవారీగా చెల్లిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనడం హాస్యాస్పదమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బకాయి ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రూ 8500 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించి విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. లేనియెడల ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కార్యచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కళామంచ్ కన్వీనర్ అశోక్ , నగర కార్యదర్శి యశ్వంత్ , నగర సంయుక్త కార్యదర్శి కురుమూర్తి , కార్యవర్గ సభ్యులు సందీప్, విష్ణు , కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.