31-10-2025 12:52:00 AM
- విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, అక్టోబర్ 30 ( విజయక్రాంతి ) : పెబ్బేరు మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులు శరవేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సుర భి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ పెబ్బేరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతనంగా ని ర్మిస్తున్న ముప్పు పడకల ఆసుపత్రి స్థలం తో పాటు నిర్మాణ మ్యాప్ ను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశా రు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో, ఇతర వైద్యాధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి....
విద్యార్థులు నిత్యం క్రమశిక్షణ పాటిస్తూ ఏదో ఒక కొత్త నైపుణ్యాన్ని పెంపొందించుకొని, ఉన్నత స్థాయికి చేరి తర్వాతి తరం వి ద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం పె బ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాలలోని తరగతి గదులు, ల్యాబ్ లు సహా ఇతర సదుపాయాలను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని సిబ్బందిని ఆరా తీశారు. బోధన సౌకర్యాలు, విద్యా ర్థుల అభ్యసన సామర్ధ్యాల గురించి అధ్యాపకులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు ఈ దశ ఎంతో కీలకమని ఇప్పు డు బాగా చదువుకుంటేనే భవిష్యత్తులో ఉన్న త స్థాయిల్లో స్థిరపడడానికి అవకాశం ఉం టుందని ఆ దిశగా చదువుకోవాలన్నారు. క ళాశాల ప్రిన్సిపల్ జయచంద్ర, అసిస్టెంట్ బీ సీ సంక్షేమ శాఖ అధికారి ఆంజనేయులు, మునిసిపల్ కమిషనర్, ఎంపీడీవో, ఇతర అధికారులు కలెక్టర్‌వెంట ఉన్నారు.