calender_icon.png 18 November, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లు పటిష్టంగా చేయాలి

18-11-2025 12:35:39 AM

‘దేవాదాయ,అటవీ,పర్యావణ శాఖ మంత్రి కొండా సురేఖ

సిద్దిపేట కలెక్టరేట్,నవంబర్:17కొమురవెల్లి మల్లన్న కల్యాణం, జాతరలను తెలంగాణ ఆధ్యాత్మిక సంస్కృతి ప్రతిబింబించేలా వైభవంగా నిర్వహించాలని దేవాదాయ,అటవీ,పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. వేలాదిగా రానున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి లోపాలు లేకుండా అన్ని శాఖలూ సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి కొండా సురేఖ, సమావేశానికి ముందు మల్లన్న జాతర, కల్యాణం పోస్టర్ను విడుదల చేశారు.

డిసెంబర్ 14 నశ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణం, జనవరి 18 నుంచి మార్చి 16 వరకు 10 వారాల పాటు జాతర జరుగుతుందని మంత్రి తెలిపారు. భక్తులకు గత సంవత్సరం ఎదురైన ఇబ్బందులు ఈసారి రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, శాఖాధికారులకు స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చారు.జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మంత్రి కొండా సురేఖ మల్లన్న భక్తురాలని, జాతర రోజుల్లో స్వయంగా పట్నాలు వేసుకుని సేవలో పాల్గొంటారని తెలిపారు.

భక్తుల ఆరోగ్య భద్రత కోసం సమీప ఆసుపత్రుల నుంచి వైద్యసిబ్బంది తరలించి విధుల్లో పెట్టాలని సూచించారు. సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి మాట్లాడుతూ, ఇప్పటికే శాఖలతో ప్రాథమిక సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. జాతర సందర్భంగా శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి పారిశుధ్య సిబ్బందిని ప్రత్యేకంగా నియమిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హరీష్, పోలీసు ఉన్నతాధికారులు,దేవాదాయ శాఖ, ఆర్టీసీ, వైద్య, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు డీసీపీ కుషాల్కర్, ఆర్డీవో సదానందం, ఏసీపీ, ఎక్సైజ్, విద్యుత్, ఆర్ అండ్ బి,పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యుఎస్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.