ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
- జీరో బిజినెస్ ట్రేడర్ల లైసెన్స్ రద్దు చేయాలి
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అవసరమైనన్ని టార్పలిన్‌లు, తేమ కొలమాని, ఆరబెట్టే యంత్రాలు సిద్ధం చేయా లని ఆదేశించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు. కొన్నిచో ట్ల జీరో బిజినెస్ జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వస్తుందని, దీనిపట్ల కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. జీరో బిజినెస్ చేసే ట్రేడర్ల లైసెన్స్‌ను రద్దు చేయడానికి ఉపేక్షించవద్దని, అదేవిధంగా దీనికి ఎవరైనా అధికారులు సహకరిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు.
బుధ వారం సచివాలయంలో మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని, వాటి పురోగతిని రోజు వారీగా సమీక్షించేందుకు ఒక డాష్ బోర్డును ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీరింగ్ విభాగంలో అవసరమైతే మరికొంత మ ందిని ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై తీసుకోవాలన్నారు.
అన్ని మార్కెట్ యార్డ్‌లను డిజిట లైజేషన్ చేసి, జీరో బిజినెస్‌ను ఆరికట్టాలని ధికారులను ఆదేశించా రు. విద్యుత్ బిల్లులను తగ్గించడానికి సోలార్ రూప టాప్ ప్యానెల్‌ల ద్వారా విద్యుత్పత్తి అవకాశాలను పరిశీలించాలన్నారు. నాలు గు మార్కెట్ యార్డ్‌లలో ప్రయోత్మకంగా చేపట్టిన పనుల పురోగతి పై మంత్రి ఆరాతీశారు.
మొక్కజొన్న కొనుగోళ్లకు సంబం ధించి మార్కఫెడ్ అధికారులు కొనుగోళ్ల కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు మం చి ధర దక్కేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీ బాయి వివరించారు. సమీ క్ష సమావేశంలో ఉన్నతాధికారులు సురేంద్ర మోహన్, మార్కఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.






