18 May, 2026 | 9:07 PM

మావోయిస్ట్ సానుభూతిపరుల అరెస్ట్

10-11-2024 12:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 9 (విజయక్రాంతి): చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు టేకు ప్లాంటేషన్ అటవీ ప్రాంతంలో పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఆరుగు రు మావోయిస్ట్ సానుభూతి పరులు పట్టుబడ్డట్లు భద్రాచలం ఇన్‌చార్జ్ డీఎస్పీ రవిందర్‌రెడ్డి తెలిపారు. వారి నుంచి పేలుడు పదార్థాలు, ఎలక్ట్రికల్ వైరు కలిగిన ప్రెషర్ కుక్కర్‌ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడ్డవారు చర్ల మండలం చెన్నపురం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు.