18 March, 2026 | 1:34 AM

వ్యభిచార నిర్వాహకుల అరెస్టు

18-03-2026 12:00 AM

అమీన్పూర్, మార్చి 17 :వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడితో పాటు విటులను, ఇద్దరు యువతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు అమీన్పూర్ సీఐ నరేశ్ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం అమీన్పూర్లోని స్వర్ణపురి కాలనీలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పింటూ అన్సారీ అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.

తమకు అందిన ఫిర్యాదు మేరకు దాడి చేయగా రాసిత్ శంకర్, అభిజిత్ బిస్వాస్ అనే ఇద్దరు విటులతో యువతులు వ్యభిచారం చేస్తుండగా రెడ్హ్యాండ్గా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిర్వాహకుడు, ఇద్దరు విటులు, ఇద్దరు యువతులను అరెస్టు చేసి రిమాం డ్కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. ఈ దాడిలో ఎస్‌ఐ ప్రభాకర్, పాల్గొన్నారు.