కలెక్టరేట్ ఎదుట ఆశాల మహాధర్నా
మహబూబాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆశాలకు ఫికస్డ్ వేతనం నెలకు 18 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట మంగళవారం దాన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి, ఆశా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రాగుల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫికస్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇస్తామని, పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా హామీలను అమలు చేయడం లేదని తక్షణమే ఫికస్డ్ వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆశాలు ఒకవైపున పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పోలీసు నిర్బంధం ద్వారా అక్రమంగా అరెస్టులు చేయడం సరైంది కాదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ, మార్చి 20వ తేదీన మంత్రి కొండ సురేఖ ఇంటి ముందు ధర్నా, మార్చి 28వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాలను నిర్వహిస్తామని రమేష్ తెలిపారు.
ఆశలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శి యాకూబీ, బైరి శోభ, సిహెచ్ శ్రీవాణి, కే కల్పన, జనగాం శ్వేత, రమాదేవి, కవిత, పుతిలి, కరుణలత, పద్మ,ఇ. శోభ, సంధ్య, నవమణి పాల్గొన్నారు.
మహబూబాబాద్‌లో వంటావార్పు
ఆశ వర్కర్లకు ఫికస్డ్ వేతనం 18వేలు ఇవ్వాలని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమంలో భాగంగా మంగళవారం వంట వార్పు నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి ఆశా జిల్లా కార్యదర్శి ఉపేంద్ర మాట్లాడుతూ ఆశాలు 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికలు ఉన్నారు.
నేటికీ వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది అయినా నేటికీ వేతనాలు పెంచలేదన్నారు. పిఆర్సి ఏరియర్స్, లెప్రసీ, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయన్నారు.వీటికి తోడు పారూ తోషికాలు ప్రతినెల రావడం లేదు దీంతో ఆశా వర్కర్లు అనేక ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు.




