15 April, 2026 | 12:27 AM

ఆరైవ్ అలైవ్ పోస్టర్ ఆవిష్కరణ

14-04-2026 08:40 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): అంతకుముందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆరైవ్ అలైవ్ కార్యక్రమ పోస్టర్ను సిపి గౌస్ ఆలం.. కలెక్టర్ చిత్ర మిశ్రా, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, ఉన్నత అధికారులతో కలిసి వేదికపై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... జిల్లాలో 96 గ్రామాల్లో రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిర్లక్ష్యంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని.. రక్షణాత్మక డ్రైవింగ్ పై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.  తలకు తగిలిన గాయాలతోనే ఎక్కువ మంది చనిపోతున్నారని.. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల ప్రాణాలు కాపాడిన వారికి పీఎం రహవీర్ సింగ్ పథకం కింద అందించే బహుమతి పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించారు.