25 February, 2026 | 5:21 AM

అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతపై అవగాహన

25-02-2026 12:18 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): మణికేశ్వరి నగర్ బస్ స్టాప్ వద్ద మంగళవారం అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్   సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో వాహనదారులకు, రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవడమే అరైవ్ అలైవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఇన్స్పెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.