15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పాటిగడ్డ ఫ్లైఓవర్ మార్గాన్ని పునఃసమీక్షించాలి

25-02-2026 12:16 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు కోట నీలిమ విజ్ఞప్తి 

సనత్‌నగర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి):- పాట్టిగడ్డ కాలనీ నుంచి రసూల్ పుర జంక్షన్ వరకు ప్రతిపాదిత ఫ్లైవోవర్ ప్రాజెక్టు మార్గాన్ని పునఃపరిశీలించి ప్రజలకు నష్టం కలగకుండా మార్పులు చేయాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా. కోట నీలిమ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కు విజ్ఞప్తి చేశారు. స్థానికులతో కలసి ఆమె కమిషనర్ ను కలిశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నెక్లెస్ రోడ్ నుంచి పాటిగడ్డ వరకు ప్రతిపాదిత ఫ్లైవోవర్ మార్గం వల్ల పాటిగడ్డ కాలనీలో నివసిస్తున్న వందలాది కుటుంబాలు ప్రభావితం అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ఫ్లైవోవర్ నిర్మాణం జరిగితే 40కు పైగా ఇండ్లు, వివిధ వారసత్వ కట్టడాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఇందులో భాగంగా స్థానికులు అభ్యర్థిస్తూ ప్రతిపాదించిన రూట్ మ్యాప్ ను కమిషనర్ కు సమర్పించారు.

స్థానికుల అభ్యర్థన మేరకు ఫ్లైఓవర్ మార్గాన్ని పున:సమీక్షించి పేదల ఇండ్లను, వారసత్వ కట్టడాలను పరిరక్షించాలని.. అందుకు అనుగుణంగా ప్రత్యా మ్నాయ మార్గాన్ని చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాటిగడ్డ స్థానికులు, బేగంపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.