15 March, 2026 | 6:26 PM

Breaking News

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •  

రేపు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ను కలువనున్న కేజ్రీవాల్

16-09-2024 06:43 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ పీఏసీ సమావేశానికి సిసోదియా, రాఘవ్ చద్దా, ఇతర ఆప్ కీలక నేతలు హాజరయ్యారు. రేపు సాయంత్రం కేజ్రీవాల్ ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. లెప్టినెంట్ గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తానని నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. నిజాయతీపరులమని ప్రజాకోర్టులో తేలాకే పదవి చేపడతామని ఆయన అన్నారు. ఈ రోజు జరిగిన భేటీలో ఎమ్మెల్యేలతో చర్చించి కొత్త సీఎం పేరును ప్రకటిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.