సత్యానికి రూపం ఆర్యసమాజ్
భారతభూమి సత్యాన్వేషకులకు పుట్టినిల్లు. ఈ వేదభూమి తపస్సు, జ్ఞా నం, ధర్మం, దయతో ఆధ్యాత్మికతకు రూపం ఇచ్చింది. సైన్సుకు శిఖరం మన సంస్కృతి. ఈ నేపథ్యంలో 19వ శతాబ్దంలో దయానంద సరస్వతి అనే అజరామరమైన అగ్నిజ్యోతిని పుట్టించింది. ఆయన 1883 అక్టోబరు 30న పరమపదించినప్పటికీ ఆయన ఆత్మప్రకాశం మాత్రం నేటికీ కోట్లాది హృదయాల్లో వెలుగుతోంది. ఆయన జీవితం ఒక ప్రశ్నతో ప్రారంభమైంది.
శివరాత్రి రోజు చిన్న మూలశంకర్ ఆలయంలో విగ్రహంపై ఎలుకలు తిరుగుతుంటే, శిలామూర్తి నిశ్చలంగా ఉండడం ఆయనలో అగ్నిగా మారిం ది. ఇదేనా దేవుడు? ఎలుకను తరిమేయని ఈ రాతిమూర్తి నిజంగా పరమేశ్వరుడా? అన్న ప్రశ్నలో పుట్టిన విప్లవం భారత చైతన్యాన్ని కదిలించే వేదవాణిగా మారింది. మూఢ నమ్మకాల పేరుతో కోట్ల రూపాయల విరాళాలు ఇస్తాం కానీ ఆకలితో ఉన్న పిల్లాడికి ఒక అన్నం మెతుకు కూడా అందివ్వం. తాను ఇచ్చిన పిలుపు ‘గో బ్యాక్ టూ వేదాస్’ అనేది ఒక నినా దం కాదు, అది భారత మానసికతను మేలుకొలిపే మహోన్నత ఆహ్వానం.
స్వామి దయానందుని దృష్టిలో వేదం అనేది కర్మకాండాల పుస్తకం కాదు జీవితం ఎలా నడిపించాలో చెప్పే శాస్త్రం. ఆయన చెప్పిన వేదమార్గం, పాత మతాచారాల పొరల్లో మగ్గిన మానవత్వాన్ని తిరిగి వెలికి తీసింది. సత్యమే దేవుడు, ధర్మమే సేవ అనే భావనతో ఆయన మతాన్ని మానవత్వంతో మిళితం చేశారు. నేడు మనం భక్తిని ప్రదర్శనగా మార్చి మనసును చీకటిలో దాచేశాం. అంధభక్తి, మత మూర్ఖత్వంలో మునిగిన సమాజాన్ని ఆయన ‘సత్యార్థ ప్రకాశం’ గ్రంథంతో మేలుకొల్పారు. విజ్ఞానం అంటే దేవునికి వ్యతిరేకం కాదు, మనిషి ఆలోచనలను శుద్ధి చేసే శక్తి.
నేడు మనం రాకెట్లు పంపుతూ సంబంధాలు కోల్పోతున్నాం. ఏఐ పెరుగుతుంటే మ నుషుల్లో కృత్రిమమేధ పెరుగుతోంది. సూర్యుడు, వాయువు, జలశక్తి వం టి ప్రకృతి తత్త్వాలను దేవుళ్లుగా గాక శక్తులుగా భావించి నేటి సైన్స్‌కు ముందే బోధించారు. స మాజంలోని బాల్యవివాహాలు, సతీసహగమనం, వర్ణవివక్ష, అంటరానిత నం వంటి దురాచారాలను ఖండించి వితంతు పునర్వివాహాన్ని సమర్థించారు, స్త్రీలకు వేదాధ్యయనం హక్కు కల్పించాలని వాదించారు.
అదే ఆ ధునిక భారత సమానత్వానికి పునాది అయింది. 1875లో స్థాపించిన ‘ఆర్య సమాజ్’ ఆయన బోధకు ప్రతిరూపం. ఇది కేవలం మత సంస్థ కాక సమాజ పునర్నిర్మాణం కోసం వెలిగిన జ్యోతి. ఆ ర్య సమాజ్ ద్వారా వేద పాఠశాలలు, అనాథాశ్రమాలు, స్త్రీ విద్యా కేం ద్రాలు స్థాపించబడ్డాయి. వేద జ్ఞానం, సేవా తత్వం, విద్యా సంస్కరణ ఈ మూడు స్థంబాలపై ఆధారపడిన ఆర్య సమాజ్ నేటికీ సత్యవీధిని వెలిగిస్తోంది.
ఇంటర్నెట్ వెలుగులో మనసులు చీకటిలో ఉన్నాయి. విజ్ఞానం పెరిగింది కానీ వివేకం తగ్గింది. ఆధ్యాత్మికత పెరిగింది కానీ మానవతా దా రిద్య్రం పెరిగింది. దయానంద సరస్వతి చూపిన దారిలో మనం నడవకపోతే, భారతదేశం వేదభూమిగా కాకుండా విభేదభూమిగా మారుతుంది. ఆయన వర్ధంతి సందర్బంగా వే దాల వెలుగులో విద్యా సేవ అనే సమానత్వపు దీపాలు వెలిగించి వేద జ్యోతి ఆరిపోకుండా చూద్దాం.
వ్యాసకర్త: మొగిలి, 8466827118






